● చిన్నారిపై హత్యాచారంతో మండిపడ్డ మదనపల్లె ● కట్టలు తెగ
స్తంభించిన జాతీయ రహదారి
గంజాయికి బానిసగా మారి..
ఒళ్లంతా మత్తెక్కి.. కామంతో కళ్లు నెత్తికెక్కి..
మగాడొకడు మృగంగా మారి..
ఏడేళ్ల చిన్నారిని చిదిమేసి..
మానవత్వం ఉసురు తీసి.. మదనపల్లె చరిత్రలో మాయని మచ్చగా మారాడు.
ఏడేళ్లు కూడా నిండని చిన్నారి..
అన్నెం.. పున్నెం తెలియని వయసు
అభం..శుభం తెలియని మనసు... తనకేం జరుగుతోందో.. వాడేం చేస్తున్నాడో.. ఆడుకునే వయసులో ఆటబొమ్మగా మారి‘పోయింది’.
నట్టింట ‘లేడి’పిల్లలా నడయాడిన తమ ఇంటి జాబిల్లిని.. తన ఒడినే ఉయ్యాలగా చేర్చి..
తన వేలినే దిక్సూచిగా మార్చి..
అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మానాన్న..
హఠాత్తుగా ముసురుకున్న అమావాస్య
చీకట్లను చూసి ‘తల్లి’డిల్లిపోయింది..
తండ్రి గుండె నీరయ్యింది.
నీరుగట్టుపల్లి కన్నీరుమున్నీరయ్యింది.
‘పచ్చ’ ప్రతినిధులేహత్యాచారాలు సాగిస్తున్నా.. నోరు మెదపని నాయకులున్నంత కాలం.. ఖద్దరు బాబులకు ఖాకీలు గులాంగిరీ చేస్తున్నంత కాలం..
ఆడ‘పిల్లల’కు రక్షణెక్కడ. కామాంధులకుఅంతమెక్కడ..? అంటూ ధర్మాగ్రహంతో
ప్రశ్నిస్తోంది ప్రజానీకం.
వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లినప్పుడు..
సమాజం మారుతుందన్న ఆశ ఆవిరైనప్పుడు.. జనావేశం కట్టలు తెగుతుంది..
సత్వర న్యాయం కావాలంటుంది..
ఈ చిన్నారి ఉదంతమే ..ఇందుకు సాక్ష్యం.
మదనపల్లె: మదనపల్లె పట్టణానికి చెందిన ఏడేళ్ల చిన్నారి మరణానికి కారణమైన నిందితుడిని తక్షణ మే శిక్షను అమలు చేయాల్సిందేనని మదనపల్లె ప్రజ లు ముక్తకంఠంతో నినదించారు. కేసులు, విచారణ పేరుతో కాలాతీతం అవుతుంది, మరణించిన బాలికకు సత్వర న్యాయం జరగాలంటే తక్షణమే శిక్షిస్తూ తీర్పు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. మంగళవారం ఉదయం ఏడేళ్ల బాలిక హత్యాచార వార్తతో మదనపల్లె పట్టణం ఒక్కసారిగా అట్టుడికింది. ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. దీంతో బాలికను హతమార్చిన కులవర్ధన్ (27) ఇంటి వద్దకు చేరుకుని ముట్టడించారు.
మృతదేహం తరలింపునకు నిరాకరణ
బాలిక మృతదేహాన్ని నిందితుడి ఇంటినుంచి తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన విశ్వప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐసీడీఎస్ పీడీ హేమావతి అతని ఇంటి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రక్రియకు అవరోధం సృష్టించవద్దని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, తహసీల్దారు కిషొర్ కుమార్ రెడ్డి, సీఐ మహ్మద్ రఫి ప్రజలతో మాట్లాడినా వారు శాంతించలేదు. నిందితుడు కులవర్దన్‌ను తమకు అప్పగిస్తేనే బాలిక మృతదేహం తరలింపుకు అంగీకరిస్తామని భీష్మించుకు కూర్చున్నారు. ఎండను లెక్కచేయకుండా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. ఈ పరిస్థితుల్లో ఉద్రికత్త పరిస్థితి కొనసాగింది. భోజనం, నీళ్లు లేకపోయినా సాయంత్రం వరకు కదలకుండా మానవత్వం చాటారు. బాలిక తల్లి ఎండకు తట్టుకోలేక, విలపిస్తూ పలుమార్లు సొమ్మసిల్లింది. డీఐజి కోయప్రవీణ్ వచ్చాక చర్చించిన తర్వాత పోలీసుల దర్యాప్తుకు ప్రజలు సహకరించారు.
కట్టలు తెగిన ఆగ్రహం
చిన్నారి మరణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు దిగింది. నీరుగట్టువారి పల్లెలో రోడ్డుపై ప్రజలు బైఠాయించారు. సంఘీభావంగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, ఎస్‌ఈసీ నెంబర్ షమీంఅస్లాం, చైర్మన్ మనూజ తదితరులు పాల్గొన్నారు. బాలిక కు టుంబానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు.
ఒకటా రెండా.. సుమారు ఆరు గంటలపాటు ముంబై–చైన్నె జాతీయ రహదారిపై అన్నమయ్య సర్కిల్ వద్ద బైఠాయించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రధానంగా అనంతపురం, పుట్టపర్తి, కడప జిల్లాల నుంచి, తంబళ్లపల్లె నియోజకవర్గం మదనపల్లెకొచ్చే వాహనాలన్నీ రోడ్డుపైనే ఆగిపోయాయి. తమిళనాడు, చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె, అనంతపురం వైపు వెళ్లే బస్సులు, రవాణా లారీలు రోడ్డుపైన నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ ఇరువైపుల పూర్తిగా స్తంభించింది. డీఐజీ కోయప్రవీణ్ మదనపల్లెకు చేరుకోవడం, అదే సమయంలో బాలిక తల్లి సొమ్మసిల్లిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాంతో ఆందోళనకారులు ఆమె వెంట వెళ్లారు. తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నచ్చజెప్పి పంపించేశారు. సాయంత్రం 6 గంటలకు రాకపోకల పునరుద్ధరణ జరిగింది.
● చిన్నారిపై హత్యాచారంతో మండిపడ్డ మదనపల్లె ● కట్టలు తెగ
● చిన్నారిపై హత్యాచారంతో మండిపడ్డ మదనపల్లె ● కట్టలు తెగ
● చిన్నారిపై హత్యాచారంతో మండిపడ్డ మదనపల్లె ● కట్టలు తెగ
● చిన్నారిపై హత్యాచారంతో మండిపడ్డ మదనపల్లె ● కట్టలు తెగ


