శాంతిభద్రతల రక్షణలో ఘోర వైఫల్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల రక్షణలో ఘోర వైఫల్యం

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

శాంతిభద్రతల రక్షణలో ఘోర వైఫల్యం

శాంతిభద్రతల రక్షణలో ఘోర వైఫల్యం

శాంతిభద్రతల రక్షణలో ఘోర వైఫల్యం

మదనపల్లె: మదనపల్లె సహా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌, ఎస్‌ఈసీ మెంబర్‌ జి.షమీం అస్లాం, మున్సిపల్‌ చైర్మన్‌ వరపన మనూజ ఆరోపించారు. ఏడేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళ హోంశాఖ మంత్రిగా ఉండగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం శాంతిభద్రతలపై ఏ స్థాయిలో పని చేస్తోందో అర్థమవుతోందన్నారు. వీధికో బెల్టుషాపుతో మద్యం ఏరులై పారుతోందన్నారు. గంజాయి విక్రయాలతో యువత గంజాయికి బానిసై పెడదారిన పడుతున్నారని అన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు. చిన్నారి మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

కఠిన చర్యలకు పార్టీలు, సంఘాల నేతల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement