మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

మల్లయ

మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం

108లో ప్రసవం మార్చి నుంచి టెన్త్‌ హాల్‌టిక్కెట్లు

తంబళ్లపల్లె : నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండపై వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ.18.74 లక్షల ఆదాయం వ చ్చింది. మల్లయ్యకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు చెల్లించిన కానుకలను మంగళవారం ఆలయ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, ఈఓ మునిరాజ సమక్షంలో శ్రీవారి సేవకులు లెక్కింపు చేశా రు. ప్రధాన హుండీ ద్వారా రూ.14,40,650, స్వామి వారి కల్యాణం చదివింపులు రూ.28 వేలు, తాత్కాలిక హుండీ ద్వారా రూ.2,81,495 మొత్తం కలిపి రూ.18,74,954 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

పెద్దతిప్పసముద్రం: మండలంలోని కాట్నగల్లు పంచాయతి ఉయ్యాలవారిపల్లికి చెందిన గంగాదేవి (26) అనే గర్భిణీకి మంగళవారం వేకువజామున పురిటి నొప్పులు రావడంతో భర్త రామాంజులు 108కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. దీంతో మండల కేంద్రంలోని 108 సిబ్బంది మదన్‌ నాయుడు, మంజులలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధి కం కావడంతో సిబ్బంది సుఖ ప్రసవం అయ్యేలా చేసారు. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించారు.

రాయచోటి టౌన్‌ : మార్చి మొదటి వారం నుంచి 10వ తరగతి హాల్‌ టిక్కెట్లు మంజూరు చేయబడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ కొండూరు శ్రీనివాసరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలు మార్చి16వ తేది నుంచి ఏప్రిల్‌ 1వ తేది వరకు నిర్వహిస్తామన్నారు. ఆయా పాఠశాలల్లోని లాగిన్‌ ద్వారా, ఎల్‌ఈఏపీ, వాట్సాప్‌ గవర్నన్స్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చునని వివరించారు. అలాగే హాల్‌ టిక్కెట్‌లో విద్యార్థుల వివరాల సవరణ కోసం సవరణ విండోస్‌ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసుకోవచ్చునని తెలిపారు.

తప్పిపోయిన బాలుడి అప్పగింత

రాయచోటి టౌన్‌ : రాయచోటి అర్బన్‌ పోలీసులు తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల 15వ తేది రాయచోటి పట్టణం మాసాపేటకు చెందిన అవులపల్లి మహమ్మద్‌ యాసీన్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్బన్‌ సీఐ బివి చలపతి తన సిబ్బందితో విచరణ సాగించారు. వారి విచారణలో ఆ బాలుడు కడప ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్నట్లు తెలుసుకొని రాయచోటి పోలీస్‌స్టేసన్‌కు తీసుకొచ్చి బాధితులకు విషయాన్ని తెలియచేశారు. మంగళవారం తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారికి బాలుడిని అప్పగించారు. ఈసందర్భంగా ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృత/్ఞతలు తెలియచేశారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

ప్రొద్దుటూరు క్రైం : నిత్యం అనుమానంతో భర్త పెట్టే చిత్రహింసలకు తాళ లేక భార్య ఆత్మహత్మకు ప్రయత్నించింది. ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన కుంటుమల్ల రామమూర్తి మద్యానికి బానిసై భార్య లక్ష్మీరాజేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ విషయమై పెద్ద మనుషులు పలు మార్లు పంచాయితీ కూడా చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి లక్ష్మీరాజేశ్వరిని కొడుతూ బయటికి వెళ్లి చావుపో అని భర్త అనడంతో.. ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లి కాంపౌండ్‌లో ఉన్న పెట్రోల్‌ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కడపకు వెళ్లాల్సిందిగా సూచించారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మీరాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి అక్క గునిశెట్టి జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

రావణ వాహనంపై భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఊరేగింపు

మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం 1
1/2

మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం

మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం 2
2/2

మల్లయ్యకొండకు రూ.19.74 లక్షల ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement