ఇలాంటి నీచుడిని పబ్లిగ్గా ఉరితీయాలి
మదనపల్లి పట్టణం నీరుగట్టివారిపల్లిలో ఏడేళ్ల బాలికనుఅమానుషంగా హత్య చేసిన మానవ మృగం కుల వర్దన్‌ను పబ్లిక్‌గా ఉరితీయాలి. ఇది క్షమించరాని నేరం. ఇలాంటి నీచుడిని ఊరికే వదలకూడదు. ఈ సంఘటన అందర్ని కలచివేస్తోంది. అంగళ్లు దగ్గర కళ్యాణ మండపంలో గతంలో నా బిడ్డను కూడా ఇలానే ఒక మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో చిన్నారి కూడా ఇదే విధంగా మరో దుష్టుడి చేష్టలకు బలైంది. బాలిక ఎంత వేదన బాధ అనుభవించి ఉంటుందో..తలచుకుంటే వళ్లు జలదరిస్తుంది. –సిద్దారెడ్డి, గుట్టపాళ్యం,
బి.కొత్తకోట మండలం
మత్తే కారణం
మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి మరణానికి గంజాయి మత్తే కారణం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలి. గంజాయి, బెల్టుషాపులతోనే రాష్టంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. – కళ్యాణ్ భరత్, రాష్ట్ర సంయుక్త
కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
శిక్షించాలి
చిన్నారి మృతి కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. పోలీసు అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలి. మదనపల్లెలో జిల్లా అధికారులు ఉన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా కఠినంగా వ్యవహరించాలి.
– శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
ముఖ్య నాయకుడి అనుచరుడు
ఏడేళ్ల చిన్నారి మృతికి కారకుడైన వ్యక్తి స్థానిక టీడీపీకి చెందిన ముఖ్యనాయకుడి అనుచరుడే. అతను తన ఒంటిపై ఆ నాయకుడి పేరును టాటూగా కూడా వేయించుకున్నాడు. నిందితుడు గంజాయి మత్తులో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నాడు. మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గంజాయి రవాణాను, విక్రయాలను పోలీసులు తక్షణమే అరికట్టాలి. – పునీత్‌కుమార్,
బహుజన యవసేన అధ్యక్షుడు
రూ.25 లక్షల పరిహారం
చిన్నారి హత్య దారుణం. సమాజానికి ఈ హత్య ఓ మచ్చ. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నిందితున్ని కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి. –వీఎస్.రెడ్డి,
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి
మెతక వైఖరి వల్లే
పోలీసుల మెతక వైఖరే ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. రౌడీషీటర్లు, సంఘవిద్రోహశక్తులపై కఠినవైఖరి లేనిఫలితంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇకౖపైనెనా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి.
– కృష్ణప్ప, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
ప్రభుత్వ వైఫల్యం
మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి మృతి ఘటన ప్రభుత్వ వైఫల్యమే. చిన్నారి అదృశ్యమైన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఘటనను అడ్డుకోవడం సాధ్యమయ్యేది. పోలీసు వ్యవస్థలో నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే ఒక పసి ప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఈ ఘటనకు పోలీసు అధికారులు, ప్రభుత్వం బాధ్యత వ్యవహరించాల్సిందే. – మర్రి సుమిత్ర,
ఏపీమహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి
ఇలాంటి నీచుడిని పబ్లిగ్గా ఉరితీయాలి
ఇలాంటి నీచుడిని పబ్లిగ్గా ఉరితీయాలి


