చైతన్యపురి: ఓ భవనం సెల్లార్‌లో హైడ్రాలిక్ పార్కింగ్ రాడ్‌కు వాచ్‌మన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. చైత్యపురి బస్ స్టాప్ వెనకవైపు నీరటి రాజు, అతని సోదరులు కలిసి కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిరి్మస్తున్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న శ్యామల ముత్తయ్య (40)ను అక్కడ వాచ్‌మన్‌గా నియమించారు. అయితే ముత్తయ్య సోమవారం తెల్లవారుజామున సెల్లార్‌లో హైడ్రాలిక్ కార్ పార్కింగ్ రాడ్‌కు ఉరేసుకుని కనిపించాడు.
మరో వాచ్‌మన్ గమనించి సూపర్‌వైజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ముత్తయ్య భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. కూతురుకు వివాహం చేశాడు. కుమారుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. తన తండ్రికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కూతురు, కుమారుడు మీడియాకు తెలిపారు.


