11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక | Elections for 11 municipality chairmen today | Sakshi
Sakshi News home page

11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక

Feb 17 2026 10:12 AM | Updated on Feb 17 2026 10:52 AM

Elections for 11 municipality chairmen today

సాక్షి హైదరాబాద్ : రాష్ట్రంలో పలు కారణాలతో వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక నేడు అధికారులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొర్రూరుతో పాటు జనగామ మున్సిపాలిటీల ఛైర్మన్‌ స్థానాలకు సమాన స్థానాలు రావడంతో అధికారులు డ్రా ద్వారా ఛైర్మన్‌ని ఎన్నిక చేయనున్నట్లు సమాచారం అందుతుంది.

జనగామా మున్సిపాలిటీకి ఎక్స్‌ అఫీషియో స్థానాలతో కలిసి కాంగ్రెస్‌ 16, బీఆర్ఎస్‌16 స్థానాలు వచ్చాయి. అయితే ఈ ఛైర్‌పర్సన్ స్థానంకోసం అధికారులు డ్రా తీసే అవకాశం కనిపిస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఇదివరకే ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు.మరోవైపు తొర్రూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాంతంలో కూడా ఎక్స్‌ అఫిషియోతో కలిసి కాంగ్రెస్‌కు 9, బీఆర్ఎస్‌ 9, స్థానాలు వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా డ్రా తీసే ఛాన్స్‌ ఉంది. అయితే దీనిపై ఇదివరకే వివాదం నెలకొంది. ఎంపీ కావ్య ఎలా ఓటు వేస్తారనే బీఆర్ఎస్‌ ఆరోపిస్తుంది. దీంతో శాంతిభద్రతల రీత్యా 144 సెక్షన్ విధించారు. ఎస్పీ ఆధ్యర్యంలో 700మందితో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

నిన్న 11 మున్సిపాలిటీల్లో కోరం లేకపోవడంతో పాటు పలు కారణాలతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు రద్దయ్యాయి. అవి ఇబ్రహీంపట్నం, తొర్రూర్, సుల్తానాబాద్, కాగజ్‌నగర్..ఇల్లందు, క్యాతన్‌పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ జనగామ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement