Hyderabad: ట్రాఫిక్ క్లియర్ కంటే చలాన్లకే ప్రాధాన్యం? | Mahankali Traffic Police Three Fines Same Vehicle | Sakshi
Sakshi News home page

Hyderabad: ట్రాఫిక్ క్లియర్ కంటే చలాన్లకే ప్రాధాన్యం?

Feb 17 2026 7:50 AM | Updated on Feb 17 2026 9:28 AM

Mahankali Traffic Police Three Fines Same Vehicle

ఒక కారు.. మూడు గంటలు.. మూడు చలానాలు

హైదరాబాద్: సిటీ ట్రాఫిక్‌ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడంపై కంటే చలాన్ల మీదే వారికి ఎక్కువ దృష్టి ఉంటుందనే విమర్శలకు ఊతమిచ్చే ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. చేతిలో కెమెరా, మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని కేవలం చలాన్ల కోసమే రోడ్లపై వేచి చూసే పోలీసులు చాలాచోట్ల కనిపిస్తుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఫొటో తీయడమే వారి డ్యూటీ.

 ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి టీఎస్‌ 10ఎఫ్‌డీ 8002 కారును ఆర్పీరోడ్‌లోని దర్గా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉదయం 10.15 గంటలకు నిలిపి, మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ మధ్య సమయంలో కారుకు ఉదయం 10.29, 10.50, మధ్యాహ్నం 12.18 గంటలకు వరుసగా మూడు చలాన్లు వేశారు ట్రాఫిక్‌ పోలీసులు. అవి కూడా వేర్వేరు సెక్షన్లకు కాదు. అన్నీ కూడా క్యారేజ్‌ వే లో పార్కింగ్‌ పేరిటే కావడం గమనార్హం. ఇదీ మహంకాళి ట్రాఫిక్‌ పోలీసులు చేసిన ఘన కార్యం. రాణిగంజ్, ఆర్పీరోడ్‌లోని షాపుల ముందు నిత్యం పార్క్‌ చేసే వాహనాలను మాత్రం పట్టించుకోరు.  

Advertisement
 
Advertisement
Advertisement