శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన | Ysrcp Members Protest In Legislative Council | Sakshi
Sakshi News home page

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన

Feb 18 2026 10:23 AM | Updated on Feb 18 2026 11:14 AM

Ysrcp Members Protest In Legislative Council

సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ రత్నాబాయి, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతికి శానమండలి సంతాపం తెలిపింది రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనమండలికి వైఎస్సార్‌సీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లారు. ఇందాపూర్‌ డెయిరీ అంశంపై రెండో రోజు వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. హెరిటేజ్‌, ఇందాపూర్‌ డెయిరీ అంశంపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. వాయిదా తీర్మానంపై వైఎస్సార్‌సీపీ చర్చకు పట్టుపట్టింది.

వైఎస్సార్‌సీపీ వాయిదా  తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనతో ఐదు నిముషాల పాటు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు.

మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వాళ్ళిద్దరు వాయిదా తీర్మానం ఇవ్వడంలో వింత లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడో చంద్రబాబు కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అని మంత్రి నారా లోకేష్ అనడం హాస్యస్పదం. వాళ్ళిద్దరితో వాయిదా తీర్మానం ఇప్పించి మా పార్టీ వాళ్ళు అనడం కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం. ఇందాపూర్ డెయిరీపై మేము చర్చకు పట్టుపడుతున్నాం. మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్‌ విసిరారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement