విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఢీలా | PropEquity analysis highlights important trends in India real estate market | Sakshi
Sakshi News home page

విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఢీలా

Feb 13 2026 8:43 AM | Updated on Feb 13 2026 10:21 AM

PropEquity analysis highlights important trends in India real estate market

2025లో 38 శాతం డౌన్‌

2,406 యూనిట్ల విక్రయాలు

టాప్‌–15 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తగ్గిన అమ్మకాలు 

విశాఖపట్టణం సహా దేశవ్యాప్తంగా టాప్‌–15 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు ఢీలాపడ్డాయి. 2024తో పోలిస్తే 10 శాతం తగ్గి 1.56 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అమ్మకాల విలువ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం ఇళ్లకు మాత్రం ఆదరణ కొనసాగుతోంది. రూ.కోటికి మించి ధరల శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు గతేడాది 9 శాతం పెరిగాయి. మొత్తం ఇళ్ల విక్రయాల్లో వీటి వాటా 23 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది.  

  • విశాఖపట్టణంలో 2025లో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 2,406గా ఉన్నాయి. 2024లో విక్రయాలు 3,858 యూనిట్లతో పోలి్చతే 38 శాతం తగ్గాయి.  

  • కోయింబత్తూర్‌లో 4 శాతం తక్కువగా 3,702 యూనిట్లు విక్రమయ్యాయి.

  • కోచిలో 17 శాతం తగ్గి 2,214 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి.  

  • నాగ్‌పూర్‌లోనూ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. 6,260 యూనిట్లు అమ్ముడయ్యాయి.  

  • భువనేశ్వర్‌లో 4,885 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 25 శాతం తగ్గాయి.

  • వదోదరలో 19 శాతం తగ్గి 13,798 యూనిట్లు, సూరత్‌లో 15 శాతం తక్కువగా 19,835 యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి. గాం«దీనగర్‌లో విక్రయాలు 13,884 యూనిట్ల నుంచి 13,710 యూనిట్లకు పరిమితమయ్యాయి.  

  • అహ్మదాబాద్‌లో 51,148 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2024లో విక్రయాలు 55,315 యూనిట్ల కంటే 8 శాతం తగ్గాయి.

  • భోపాల్‌లో 5 శాతం తక్కువగా 3,599 యూనిట్లు, జైపూర్‌లోనూ ఇంతే మేర తగ్గి 9,758 యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి.

  • మెహాలీలో మాత్రం 34 శాతం అధికంగా 6,118 యూనిట్లు, లక్నోలో 6 శాతం అధికంగా 4,053 యూనిట్లు చొప్పున అమ్ముడయ్యాయి.

ఎన్నో కారణాలు..

గతేడాది ద్వితీయ శ్రేణి పట్టణాల్లో (టైర్‌–2) అమ్మకాలు ప్రథమ శ్రేణి పట్టణాల్లో మాదిరే ఉన్నట్టు ప్రాప్‌ఈక్విటీ సీఈవో సమీర్‌ జసూజ తెలిపారు. రూ.కోటిలోపున్న ఇళ్ల సరఫరా తగ్గడమే విక్రయాలు బలహీనపడేందుకు కారణమని పేర్కొన్నారు. టైర్‌–2 పట్టణాల్లో రూ.కోటిలోపు ఇళ్లకే డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు, కొనుగోలుదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా వచ్చే ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు అధికంగా ఉంటుండడం డిమాండ్, సరఫరాపై ప్రభావం చూపించినట్టు వివరించారు.

ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు

Advertisement
 
Advertisement
Advertisement