రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌! | Viral Train Video Sparks Outrage After Woman Passenger Alleges Obscene Gestures By Co-Traveller, Prompts RPF Probe | Sakshi
Sakshi News home page

రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌!

Jun 30 2026 1:47 PM | Updated on Jun 30 2026 3:34 PM

Woman records video to teach lesson to a man making obscene gestures

న్యూఢిల్లీ: వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రూపాలీ దీక్షిత్ అనే మహిళా ప్రయాణికురాలిని చూసి రైల్వే ట్రాక్‌పై నిలుచున్న ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జూన్ 29న దంకుని(పశ్చిమ బెంగాల్‌) జంక్షన్ వైపు రైలు వెళ్తున్న సమయంలో, రైలు గేటు దగ్గర నిలబడిన ఆమెకు సదరు వ్యక్తి అసభ్య సైగలు చేశాడు. దీనిని గమనించిన ఆ మహిళ వీడియో తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వే శాఖ, ‘రైల్ మదద్’, ‘ఆర్‌పీఎఫ్’ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై రైల్వే రక్షణ దళం తక్షణమే స్పందించి, తదుపరి చర్యల కోసం కేసును హౌరా డివిజన్‌కు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆర్‌పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తుది నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి చర్యను పలువురు తీవ్రంగా ఖండించగా, కొందరు నెటిజన్లు బాధితురాలి ప్రయాణ విధానాన్ని ప్రశ్నిస్తూ విమర్శలకు దిగారు. అయితే దుస్తులు లేదా నిలబడే స్థలాన్ని బట్టి మహిళలపై వేధింపులను సమర్థించలేమని మరికొందరు ప్రయాణికులు, నెటిజన్లు అంటున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement