ఆటో డ్రైవర్‌ రిప్లై చూసి షాకైన యువతి, వైరల్‌ వీడియో | Woman auto ride ends in failed payment driver responds like a manager in emails | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ రిప్లై చూసి షాకైన యువతి, వైరల్‌ వీడియో

Jun 30 2026 3:00 PM | Updated on Jun 30 2026 3:09 PM

 Woman auto ride ends in failed payment driver responds like a manager in emails

ఒక సాధారణ ఆటో ప్రయాణం, పేమెంట్ ఫెయిల్ , ఆ తర్వాత సదరు ఆటో డ్రైవర్‌తో జరిగిన కార్పొరేట్ లెవల్‌ సంభాషణ విధంగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆఫీస్ ఈమెయిల్స్‌ను తలపించేలా సాగిన ఈ చాటింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిష్ఠా శెట్టి అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఆసక్తికర కథనాన్ని షేర్ చేసింది. 

అసలేం జరిగిందంటే?
నిష్ఠా శెట్టి ఒకరోజు ఆఫీస్‌కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక డ్రైవర్‌కు గూగుల్ పే  ద్వారా డబ్బులు పంపింది.  అయితే, ఐడీ సమస్య వల్ల ఆ పేమెంట్ ఫెయిల్ అయిందని ఆమె తర్వాత గమనించింది. దీని గురించి డ్రైవర్‌కు హిందీలో మెసేజ్ చేస్తూ.. "ఆప్కా పేమెంట్ ఫెయిల్ హో గయా హై బికాజ్ యే ఐడీ కా కుచ్ ఇష్యూ హో రహా హై" (ఐడీ సమస్య వల్ల మీ పేమెంట్ ఫెయిల్ అయింది) అని పంపింది. దానికి  ఆ ఆటో డ్రైవర్‌ ఇచ్చిన రిప్లై హాట్‌ టాపిక్‌గా నిలిచింది.


ఆమె పంపిన సాధారణ మెసేజ్‌కు ఆ ఆటో డ్రైవర్ ఎంతో ప్రొఫెషనల్‌గా, ఒక కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ తరహాలో ఇంగ్లీష్‌లో ​కార్పొరేట్‌ కంపెనీ మేనేజర్‌ లెవల్‌లో సమాధానం పంపాడు.

"ఒకవేళ మీరు ఆటోలోనే తిరిగి రావాలని ప్లాన్ చేసుకుంటుంటే, నేనే వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, ఈజ్ దట్ ఓకే (సరేనా)? వీలైతే ఆ సమయంలో నాకు క్యాష్ ఇవ్వచ్చు. మీకు ఓకేనా? లేదా నేను మిమ్మల్ని ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడికే వస్తాను, మీ దగ్గర క్యాష్ ఉంటే అక్కడ కలెక్ట్ చేసుకుంటాను."

డ్రైవర్ చాటింగ్ టోన్ చూసి నిష్ఠా ఆశ్చర్యపోయింది. "అతనేంటి ఆఫీస్ ఈమెయిల్‌కు రిప్లై ఇచ్చినట్లు మాట్లాడుతున్నాడు?" అని వీడియోలో పేర్కొంది. అతని ప్రొఫెషనలిజం చూసి  కాస్త కంగారు పడ్డానంటూ సరదాగా చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె కూడా తన టోన్ మార్చేసి, ఇంగ్లీష్‌లోనే.. "ప్లీజ్ కమ్ బై 6 పీఎం. వైల్ రిటర్నింగ్" (తిరిగి వెళ్లేటప్పుడు సాయంత్రం 6 గంటలకల్లా రండి) అని మెసేజ్ పెట్టింది. దానికి ఆ డ్రైవర్ కేవలం ఒకే ఒక్క ముక్కలో "Noted" (నోటెడ్)  రిప్లై ఇవ్వడంతో మరింత ఆశ్చర్యపోవడం నిష్ఠా వంతైంది. 

ఇదీ చదవండి: హై-టెక్‌ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు

నెటిజన్ల కామెంట్లు 
ఈ చాటింగ్‌పై నిష్ఠా జోక్ చేస్తూ తాను సగం మందితో పోలిస్తే ఈ ఆటో డ్రైవర్‌కే కార్పొరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉన్నాయంటూ  క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్‌!

"ఈ ఆటో డ్రైవర్‌కు కచ్చితంగా ఒక లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రొఫైల్ ఉండాలి" అని ఒకరు కామెంట్ చేయగా. చివర్లో 'Noted' అని చెప్పడం పీక్ కార్పొరేట్ బిహేవియర్" అంటూ మరొకరు సరదాగా కామెంట్‌ చేశారు.ఒక చిన్న పేమెంట్ సమస్య వల్ల జరిగిన ఈ సంభాషణ, ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement