హై-టెక్‌ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు | Prostitution racket busted in Mumbai Marathi lead actress Bengali actress rescued | Sakshi
Sakshi News home page

హై-టెక్‌ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు

Jun 30 2026 12:59 PM | Updated on Jun 30 2026 2:21 PM

Prostitution racket busted in Mumbai Marathi lead actress Bengali actress rescued

ముంబ‌యిలో మ‌రోసారి హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారాన్ని  పోలీసులు  చేధించారు.  గిర్‌గావ్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసి, ఇద్దరు నటీమణులను రక్షించారు. ఈ వ్యవహారంలో పింప్‌ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, రక్షించిన వారిలో ఒకరు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రధాన నటి కాగా, మరొకరు బెంగాలీ చిత్రాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రలు (కామియో రోల్స్) పోషించారు.  బాధితుల ప్రైవసీచ  భద్రత దృష్ట్యా వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. వారిని నిందితులుగా కాకుండా బాధితులుగానే పరిగణించి రక్షించినట్టు తెలిపారు.

మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెబుతున్న నిందితుడిని పోలీసులు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతనికి సినీ పరిశ్రమలోని పలువురితో  ఉన్న సంబంధాలు, పరిచయాలతోనే ఈ గలీజు దందాకు తెరతీశాడు. అయితే ఈ ముఠా ద్వారా మరికొంతమంది మహిళలను వేధించారు అనే కోణంలో పోలీసులు అతని కాంటాక్ట్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ నటీమణులు ఆ హోటల్‌కు ఎలా వచ్చారు? వారిని ఎవరైనా బెదిరించారా లేదా ఆర్థికంగా వాడుకున్నారా? అనే విషయాలపై విచారణ జరుగుతోందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్‌!

దీనికి కొద్ది రోజుల ముందే థానేలోని కల్యాణ్ ప్రాంతంలో కూడా ఒక హోటల్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. అక్కడ ఒక మహిళా అడ్వకేట్ (న్యాయవాది) ఈ ముఠాను నడుపుతున్నట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆమె ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు సాధారణ దుస్తుల్లో కస్టమర్లలా వెళ్లి నిఘా పెట్టి, ఇద్దరు మహిళలను రక్షించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించిన ఫోన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తూ, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: అపుడు లవర్‌ కోసం ఇస్లాంలోకి ఆయుష్‌ : ఇపుడు కొత్త ట్విస్ట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement