ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీకి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దేవరాజ్ మాలిక్ కుమారుడు 30 ఏళ్ల ఆయుష్ మాలిక్ గుర్తున్నాడా? ముస్లిం యువతిని వివాహం చేసుకొనేందుకు ముస్లింగా మారి ఈద్ పండుగ రోజున నమాజ్ చేస్తూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాడు. మత మార్పిడి నిరోధక చట్టం కింద ఆయుష్‌పైనా, వధువు తల్లిదండ్రులపైనా కేసు నమోదు కావడం అప్పట్లో చర్చకు దారి తీసింది.
ఇపుడీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్ మాలిక్, ఇప్పుడు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టం కింద దేవరాజ్ మాలిక్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషి ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
Ayush Malik, who had earlier claimed to adopt Islam in Shamli, Western Uttar Pradesh, has returned to Sanatan Hindu Dharma.
Ayush Malik reconverted to Hinduism at his home in the presence of his family.
Yashvir Maharaj stated that Ayush Malik embraced Hindu religion once… pic.twitter.com/jYtLN4QHF2— VARAHA WARRIOR (@VarahaWarrior) June 30, 2026
తన తల్లిదండ్రులు పడుతున్న బాధను గమనించిన తర్వాత, స్వచ్ఛందంగానే తిరిగి హిందూ మతాన్వి స్వీకరించాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయుష్ హిందూ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ, ప్రార్థనలు చేయడం విశేషం. తాను గతంలో ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, ఇప్పుడు స్వచ్ఛందంగా సనాతన ధర్మానికి తిరిగి వచ్చి తన కుటుంబంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నానని ఆ వీడియోలో చెప్పాడు. తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాడని అతని తండ్రి దేవరాజ్ మాలిక్ తెలిపారు.
ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!
గతంలో ఏం జరిగింది?
బి-ఫార్మా పట్టభద్రుడైన ఆయుష్ తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్ నిర్వహణలో సహాయపడేవాడు. 2018లో కాలి గాయానికి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి చాందినీ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్ మాలిక్ , చాందినిని వివాహమాడాడు. ఈ విషయంలో ఎవరి బలవంతం లేదని, స్వచ్ఛందగానే ఇస్లాంను స్వీకరించానని, తన భార్య కోసం న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన ఆయుష్ ప్రకటించాడు. అయితే చాందినీ,ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఇస్లాం మతాన్ని స్వీకరించేలా క్రమంగా ప్రభావితం చేశారని పోలీసులు తెలిపారు. 2023లో ఆయుష్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ఇస్లాం మతంలోకి మార్చి 'మహ్మద్ అలీ'గా పేరు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో నికాహ్ (వివాహ) వేడుక కూడా జరిగిందని అందులో పేర్కొన్నప్పటికీ, విచారణలో ఎటువంటి వివాహ ధృవీకరణ పత్రం లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన కుటుంబ ఆస్తిని చేజిక్కించుకునే కుట్రలో భాగంగా, చాందినీ ఖురేషీ ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీ కలిసి ఆయుష్‌ను మభ్యపెట్టి (బ్రెయిన్ వాష్ చేసి), 'మహ్మద్ అలీ' పేరుతో ఇస్లాం మతంలోకి మార్చారని దేవరాజ్ మాలిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయుష్ హిందూ మతంలోకి మారడం ట్విస్ట్. మరి అతని భార్య పరిస్థితి ఏంటి? భార్యతో విడిపోయాడా? కలిసే ఉంటాడా అన్నే ప్రశ్నలకు సమాధానం లేదు.


