ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో గల బారా షహీద్ దర్గా వద్ద మొహరం మాసంలో జరిగే ప్రసిద్ధ మతసామరస్య వేడుక రొట్టెల పండుగ.
భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించి, కోరిక తీరిన తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం ఇక్కడి ప్రధాన ఆచారం.
స్వర్ణాల తీరం భక్తజన సంద్రమైంది. రొట్టెల పండగకు భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరు వులో పవిత్ర స్నానమాచరించి కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలను వదలగా...కోర్కెలతో వచ్చిన భక్తులు రొట్టెలు అందుకు న్నారు. అనంతరం బారాషహీద్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. తమ ఆకాంక్షలు నెరవేరాలని మొక్కుకున్నారు.


