తన డ్రీమ్ జాబ్ కోసం ఎదురు చూసి, చూసి విసిగిపోయిన వ్యక్తికి అనుకోని అదృష్టం కలసి వస్తే. ఆ ఆనందానికి హద్దే ఉండదు కదా. సరిగ్గా ఇలాగే ఎన్నో రిజెక్షన్ ఈ మెయల్స్ తరువాత, అదీ ఐటీ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉద్యోగ కొనసాగుతున్న వేళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 1.4 కోట్ల బేస్ శాలరీతో రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగం సాధించిన వైనం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎన్ని రిజెక్షన్లు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నిస్తే చివరికి అనుకున్న విజయం సాధించవచ్చని ఈ ఇంజనీర్ జర్నీ నిరూపించింది.
ఒక సంవత్సరం పాటు సాగించిన అవిశ్రాంత ఉద్యోగ వేట, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. దాదాపు 25 కి పైగా రిజెక్షన్ల (తిరస్కరణల) తర్వాత ఎట్టకేలకు తన డ్రీమ్ జాబ్ కొట్టేశాడు. దీనికి సంబంధించిన వివరాలను అతను నెట్టింట పంచుకోవడంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.
తనకు ఆరేళ్ల అనుభవం ఉందని, ఒక టైర్ 1 కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారని, ఇటీవలే ఒక సీడ్ స్టేజ్ స్టార్టప్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్‌కు ఎంపికైనట్టు అతను తెలిపాడు.
ఆ ఇంజనీర్ అందుకున్న భారీ ఆఫర్ వివరాలు
బేస్ శాలరీ : రూ. 1.4 కోట్లు, బోనస్: పర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్
ESOPs (షేర్లు): 4 సంవత్సరాల వెస్టింగ్ పీరియడ్‌తో కూడిన 1,20,000 యూఎస్ డాలర్ల (సుమారు రూ. 1 కోటి) విలువైన స్టాక్స్. (హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)
మొదటి ఏడాది మొత్తం ప్యాకేజీ: దాదాపు రూ. 1.7 కోట్లు.
పాత జీతం ఎలా ఉందంటే : బేస్ శాలరీ రూ. 60 లక్షలు, బోనస్ రూ. 4 లక్షలు , 25,000 డాలర్ల విలువైన స్టాక్స్ ఉండేదట.
టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్‌లు కొనసాగుతున్న ప్రస్తుత కష్టసమయంలో తనకు ఇంత మంచి ఆఫర్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆ ఇంజనీర్ తెలిపాడు. గత ఎనిమిదేళ్లుగా అప్పుడప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లీట్‌కోడ్ (LeetCode) ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎంత కష్టపడినా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతూనే వచ్చానంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్
నిలకడగా (Consistency) ప్రిపేర్ అవ్వడమే తనకు ఎదురైన అతిపెద్ద సవాలని అతను అంగీకరించాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆపి మళ్లీ మొదలుపెట్టినప్పుడు, అంతా మొదటినుంచీ నేర్చుకుంటున్నట్టు అనిపించిందని వివరించాడు. అంతేకాదు తన ఉద్యోగ వేటలో తనను రిజెక్ట్ చేసిన దాదాపు 29 కంపెనీల పేర్లను కూడా ఓపెన్‌గా పంచుకున్నాడు. వీటిలో అమెజాన్, బ్లూమ్‌బెర్గ్, క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare), కోర్సెరా, డి.ఇ. షా , అగోడా, ప్రోటోకాల్ ల్యాబ్స్, బిట్‌గో, నానోనెట్స్, ఫిన్‌బాక్స్, యుగాబైట్, డెకాగాన్, , అపోలో ఏఐ కోడింగ్ వంటి సంస్థలు ఉన్నాయి.


