ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ | Iran warTehran denies Trump claim of meeting in Doha | Sakshi
Sakshi News home page

ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ

Jun 30 2026 1:22 PM | Updated on Jun 30 2026 2:40 PM

Iran warTehran denies Trump claim of meeting in Doha

అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించి ఇరాన్‌ మరోసారి సంచలన  ప్రకటన చేసింది.  ఇరుదేశాల మధ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని ట్రంప్ చెప్పగా, తాము అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి వెళ్లడం లేదని ఇరాన్ సోమవారం సాయంత్రం స్పష్టం చేసింది.

ఈ చర్చల కోసం అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన సలహాదారులు   స్టీవ్ విట్కాఫ్ , ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సాంకేతిక చర్చలతో పాటు జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకోసం దోహాకు వెళ్లనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటనపై ఇరాన్‌ స్పందించింది.


ఇరాన్ స్పష్టీకరణ
ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రతినిధి బృందం రాబోయే రెండు రోజులు దోహాలోనే ఉంటుందని, అయితే వారు అమెరికా అధికారులను కలవడానికి కాకుండా, ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికా తన కాల్పుల విరమణ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చేలా చేయడానికి మాత్రమే వెళ్తున్నారని తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.

ఇదీ చదవండి: హై-టెక్‌ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు

రూట్ ఫీజులపై ఒమన్‌తో చర్చలు
హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఓడల మార్గాల్లో మార్పులు, ఫీజుల వసూలు వంటి కొత్త నిబంధనలపై ఒమన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఘరీబాబాదీ పేర్కొన్నారు. ఒకవేళ ఒమన్ కలిసి రాకపోయినా, ఇరాన్ ఒంటరిగానే ముందుకు వెళ్తుందని హెచ్చరించారు. గత రెండు వారాలుగా ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి, గత గురువారం నుండి ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు పెద్ద ముప్పుగా మారాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరు దేశాలు దాడులు కొనసాగిస్తున్నాయి. 

అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని మూడు హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా మద్దతుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి వెనక్కి తగ్గాల్సి ఉన్నప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో అక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: అపుడు లవర్‌ కోసం ఇస్లాంలోకి ఆయుష్‌ : ఇపుడు కొత్త ట్విస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement