 
													ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(నవంబర్ 2) నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ప్రోటీస్ తొలిసారి తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.
తుది పోరులో ఈ రెండు టీమ్స్‌లో ఏది గెలిచినా చరిత్రే కానుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గానీ భారత్ ఒక్కసారి కూడా వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

అయితే ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఈ క్రమంలో ఇరు జట్లు అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని చర్చించుకుంటున్నారు.

రిజర్వ్ డే..
ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం (నవంబర్ 2) నాడు కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. రిజర్వ్ డే అయిన సోమవారం(నవంబర్ 3) ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. మరోవైపు ఆదివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే సోమవారం రోజు టాస్ నిర్వహిస్తారు.  

మ్యాచ్ రద్దు అయితే?
కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా  120నిమిషాలు సమయం కేటాయించింది. ఈ ఎక్స్‌ట్రా సమయం మ్యాచ్‌డేతో పాటు రిజర్వ్‌డేకు కూడా వర్తిస్తోంది. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
