భార‌త్ వ‌ర్సెస్ ఆసీస్ సెమీఫైనల్ అప్‌డేట్స్‌.. | India vs Australia, Womens World Cup 2025 semi-final Live updates | Sakshi
Sakshi News home page

World Cup 2025: భార‌త్ వ‌ర్సెస్ ఆసీస్ సెమీఫైనల్ అప్‌డేట్స్‌..

Oct 30 2025 3:09 PM | Updated on Oct 30 2025 10:10 PM

India vs Australia, Womens World Cup 2025 semi-final Live updates

IND-W vs AUS_W Semi-final Live updates: ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025 సెకెండ్ సెమీఫైన‌ల్లో భాగంగా గురువారం న‌వీ ముంబై వేదిక‌గా ఆస్ట్రేలియా-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.

నాలుగో వికెట్ డౌన్‌..
దీప్తీ శర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన దీప్తీ.. రనౌట్ రూపంలో వెనుదిరిగింది. బారత విజయానికి 54 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్‌(96) ఉంది.

భారత్‌ మూడో వికెట్‌ డౌన్‌..
226 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.. సదర్లాండ్‌ బౌలింగ్‌లో ఔటైంది. దీంతో 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 38 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. భారత విజయానికి 72 బంతుల్లో 98 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్‌(90), దీప్తీ(10) ఉన్నారు.

రసవత్తరంగా భారత్‌-ఆసీస్ సెమీఫైనల్‌
భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సెకెండ్ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. 339 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా అద్బుతంగా పోరాడుతోంది. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.  రోడ్రిగ్స్‌, హర్మన్ కలిసి మూడో వికెట్‌కు 167 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 113 పరుగులు కావాలి. జేమిమా రోడ్రిగ్స్‌(85), హర్మన్ ప్రీత్ కౌర్‌(89) ఉన్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్‌ సెంచరీ
ఆసీస్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడుతోంది. 65 బంతుల్లో తన ఆర్ధ శతకాన్ని హర్మన్ పూర్తి చేసుకుంది. 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రోడ్రిగ్స్‌, హర్మన్ కలిసి మూడో వికెట్‌కు 130 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 120 బంతుల్లో 150 పరుగులు కావాలి.

రోడ్రిగ్స్‌ హాఫ్‌ సెంచరీ..
టీమిండియా  మిడిలార్డర్ బ్యాటర్లు జేమిమా రోడ్రిగ్స్‌(54), హర్మన్(25) ప్రీత్ కౌర్ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 58 బంతుల్లో తన ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల కోల్పోయి 124 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 215 పరుగులు కావాలి.

టీమిండియా రెండో వికెట్‌ డౌన్‌..
స్మృతి మంధాన రూపంలో టీమిండియా రెండు వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మంధాన.. కిమ్‌ గార్త్‌ బౌలింగ్‌లో ఔటైంది. 10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌:66-2, క్రీజులో రోడ్రిగ్స్‌(24), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(2) ఉన్నారు.

టీమిండియాకు భారీ షాక్‌..
339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ.. గార్త్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. 6 ఓవర్లు ఆసీస్‌ స్కోర్‌: 38/1. క్రీజులో మంధాన(14), రోడ్రిగ్స్‌(8) ఉన్నారు.

భారత బౌలర్లు విఫలం.. ఆస్ట్రేలియా భారీ స్కోర్‌
ముంబై వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్‌ వద్ద ఆలౌటైంది. 

ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్(17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119) శతక్కొట్టగా.. ఎల్లీస్‌ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), గార్డెనర్‌(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తీ శర్మ తలా రెండు వికెట్లు సాధించగా.. రాధా యాదవ్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, క్రాంతి గౌడ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

కమ్‌బ్యాక్‌ ఇచ్చిన భారత బౌలర్లు..
భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. వరుస క్రమంలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత చరణి బౌలింగ్‌లో సదర్లాండ్‌(3) ఔట్ కాగా.. ఆ తర్వాత రాధా యాదవ్ బౌలింగ్‌లో పెర్రీ(77) క్లీన్ బౌల్డ్ అయ్యింది. 41 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 260/5

ఆసీస్‌ మూడో వికెట్‌ డౌన్‌..
220 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 24 ప‌రుగులు చేసిన బెత్ మూనీ.. శ్రీచ‌ర‌ణి బౌలింగ్‌లో ఔటైంది. 35 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 225-3

ఆసీస్‌ రెండో వికెట్‌ డౌన్‌..
ఆస్ట్రేలియా ఎట్ట‌కేల‌కు రెండో వికెట్ కోల్పోయింది. 119 ప‌రుగులు చేసిన లిచ్‌ఫీల్డ్‌.. అమ‌న్ జ్యోత్ కౌర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 155 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. 27.2 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 180-2

లిచ్‌ఫీల్డ్ సెంచరీ..
భార‌త్‌తో జ‌రుగుతున్న సెమీఫైన‌ల్లో ఆసీస్ యువ సంచ‌ల‌నం లిచ్‌ఫీల్డ్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగింది. కేవ‌లం77 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను ఆమె అందుకుంది. 24 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా వికెట్ న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. క్రీజులో లిచ్‌ఫీల్డ్‌తో పాటు పెర్రీ(40) ఉన్నారు.

18 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోరు: 115-1
పెర్రీ 36, లిచ్‌ఫీల్డ్‌ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 72/1
10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో లిచ్‌ఫీల్డ్‌(46), పెర్రీ(18) ఉన్నారు.

ఆసీస్‌ తొలి వికెట్‌ డౌన్‌..
25 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కెప్టెన్‌ అలీసా హీలీ.. క్రాంతి గౌడ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యింది. అయితే ఆమె ఔటైన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్‌లు నిలిపివేశారు.

దూకుడుగా ఆడుతున్న ఆసీస్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా  24 పరుగులు చేసింది. క్రీజులో లిచ్‌ఫీల్డ్‌(17), హీలీ(4) ఉన్నారు. రేణుకా బౌలింగ్‌లో హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కెప్టెన్ హర్మన్ జారవిడిచింది.

ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025 సెకెండ్ సెమీఫైన‌ల్లో భాగంగా గురువారం న‌వీ ముంబై వేదిక‌గా ఆస్ట్రేలియా-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అలీస్సా హీలీ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చింది.

భారత్‌ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అదేవిధంగా భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. రిచా ఘోష్‌, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారు. స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.

తుదిజట్లు 
భారత్‌
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్‌ కీపర్‌), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.

ఆస్ట్రేలియా
ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఎలీస్‌ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్‌నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement