కుమామోటో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 21–17తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2021 ప్రపంచ చాంపియన్‌లో కీన్ యె (సింగపూర్)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో లక్ష్య సేన్ తలపడతాడు.


