IND vs PAK: పాకిస్తాన్‌ 93 పరుగులకే ఆలౌట్‌ | Womens Asia Cup Rising Stars 2026: Indian Bowlers Shine Pak 93 All Out | Sakshi
Sakshi News home page

IND vs PAK: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. పాక్‌ 93 రన్స్‌కే ఆలౌట్‌

Feb 15 2026 2:14 PM | Updated on Feb 15 2026 3:26 PM

Womens Asia Cup Rising Stars 2026: Indian Bowlers Shine Pak 93 All Out

PC: BCCI X

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దాయాదిని 93 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌-2026 టోర్నమెంట్లో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లు తలపడుతున్నాయి.

తొలుత బ్యాటింగ్‌
బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్‌ క్రికెట్‌ మైదానంలో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 

చుక్కలు చూపించిన భారత బౌలర్లు
ఓపెనర్లలో యుస్రా ఆమిర్‌ (1)ను సైమా ఠాకూర్‌ అవుట్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైమా సొహైల్‌ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ (1)ను ఐమా, హురైనా సజ్జద్‌ (2)ను కెప్టెన్‌ రాధా యాదవ్‌ పెవిలియన్‌కు పంపించారు.

ఎమాన్‌ నాజర్‌ (4)ను అనుష్క శర్మ రనౌట్‌ చేయగా..  వహీదా అక్తర్‌ (7)ను ప్రేమా రావత్‌, మొమినా రియాసత్‌ (4)ను మిన్ను మణి సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్‌ షవాల్‌ జుల్ఫికర్‌ (23)తో పాటు గల్‌ రుఖ్‌ (21) పోరాడే ప్రయత్నం చేయగా.. షవాల్‌కు రాధా యాదవ్‌, గుల్‌కు ప్రేమా రావత్‌ చెక్‌ పెట్టారు.

 

93 పరుగులకే ఆలౌట్‌
ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్‌-ఎ జట్టు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకూర్‌, రాధా యాదవ్‌, ప్రేమా రావత్‌ తలా రెండు వికెట్లు తీయగా.. జింతిమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్‌ పడగొట్టారు.

కాగా ఆసియా కప్‌ రైజింగ్‌ టీ20 టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌- పాక్‌లతో పాటు యూఏఈ, నేపాల్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి పాక్‌ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్‌ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. 

చదవండి: వైభవ్‌ సూర్యంశీ సంచలన నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement