IND vs PAK: పాకిస్తాన్ 93 పరుగులకే ఆలౌట్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దాయాదిని 93 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్-2026 టోర్నమెంట్లో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి.తొలుత బ్యాటింగ్బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. చుక్కలు చూపించిన భారత బౌలర్లుఓపెనర్లలో యుస్రా ఆమిర్ (1)ను సైమా ఠాకూర్ అవుట్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైమా సొహైల్ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్ హఫ్సా ఖలీద్ (1)ను ఐమా, హురైనా సజ్జద్ (2)ను కెప్టెన్ రాధా యాదవ్ పెవిలియన్‌కు పంపించారు.Captain Radha Yadav steps up and shows the way! 💙 Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/kjeq0xl5i8— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026ఎమాన్ నాజర్ (4)ను అనుష్క శర్మ రనౌట్ చేయగా.. వహీదా అక్తర్ (7)ను ప్రేమా రావత్, మొమినా రియాసత్ (4)ను మిన్ను మణి సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్ షవాల్ జుల్ఫికర్ (23)తో పాటు గల్ రుఖ్ (21) పోరాడే ప్రయత్నం చేయగా.. షవాల్కు రాధా యాదవ్, గుల్కు ప్రేమా రావత్ చెక్ పెట్టారు.𝐓𝐡𝐫𝐨𝐰 𝐢𝐭 𝐥𝐢𝐤𝐞 𝐀𝐧𝐮𝐬𝐡𝐤𝐚 🎯🔥A direct-hit special sends Eman Naseer back to the pavilion in style 💙Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s… pic.twitter.com/XmUJMqOQIR— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026 93 పరుగులకే ఆలౌట్ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్-ఎ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకూర్, రాధా యాదవ్, ప్రేమా రావత్ తలా రెండు వికెట్లు తీయగా.. జింతిమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.కాగా ఆసియా కప్ రైజింగ్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్- పాక్‌లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి పాక్ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. చదవండి: వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!