క్వార్టర్స్‌లో లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 21–11తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై గెలుపొందగా... శ్రీకాంత్ 11–21, 10–21తో నాలుగో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ అన్‌మోల్ ఖరబ్ 21–16, 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 17–21, 21–9, 16–21తో మాన్ వె చోంగ్–కాయ్ వున్ టీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో పానిత్‌చపోన్ (థాయ్‌లాండ్)తో లక్ష్య సేన్; చెన్ యు ఫె (చైనా)తో పీవీ సింధు తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 1–0తో పానిత్‌చపోన్‌పై ఆధిక్యంలో ఉండగా... సింధు 6–7తో చెన్ యు ఫె చేతిలో వెనుకబడి ఉంది.


