అంతా ఊహించిందే జరిగింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసింది. ఈ విధ్వంసకర ఆటగాడిని రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్, కేకేఆర్ పోటీ పడ్డాయి.
రూ. 2.75 కోట్లతో ముంబై బిడ్‌ను ప్రారంభించింది. కానీ రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై పోటీ నుంచి తప్పుకోంది. ఆ తర్వాత కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. అనంతరం రాజస్తాన్ కూడా రేసు నుంచి వైదొలగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. గ్రీన్ కోసం సీఎస్‌కే కూడా తీవ్రంగా శ్రమించింది. కానీ కేకేఆర్‌తో పోటీ పడలేక సీఎస్‌కే వెనక్కి తగ్గింది. దీంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.
గ్రీన్ రికార్డు..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డులలెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75) పేరిట ఉండేది. తాజా వేలంతో స్టార్క్‌ను గ్రీన్ వెనక్కి నెట్టాడు. అదేవిధంగా ఓవరాల్‌గా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పొందిన మూడో ప్లేయర్‌గా గ్రీన్ నిలిచాడు. ఈ జాబితాలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(రూ.27 కోట్లు) అగ్రస్ధానంలో ఉండగా.. శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు) ఉన్నాడు.
గ్రీన్‌కు వచ్చేది ఎన్ని కోట్లంటే?
అయితే గ్రీన్ దక్కించుకున్న రూ. 25.20 కోట్లలో బీసీసీఐ కోత విధించనుంది. , ఐపీఎల్ గత సీజన్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం.. విదేశీ ప్లేయర్ 18 కోట్ల కంటే ఎక్కువ పలికితే, ఆపై మిగిలిన మొత్తాన్ని బీసీసీఐ ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు చేయనుంది. దీంతో గ్రీన్ పలికిన ధరలో 7.20 కోట్లు బీసీసీఐకి వెళ్లనున్నాయి.
చదవండి: దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..


