
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. హర్మన్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్‌లో కలిపి 343 మ్యాచ్‌లు ఆడింది.
ఐసీసీ మహిళల ప్రపంచకప్( ICC Womens World Cup 2025)లో వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో హర్మన్ ఈ ఫీట్ సాధించింది. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్(350) అగ్రస్దానంలో ఉంది. బేట్స్ ఇటీవలే న్యూజిలాండ్‌పై తన 350 మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది.
కాగా 2009లో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా తన సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు 154 వన్డేలు, 182 టీ20లు, 6 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత 2022 నుంచి భారత మహిళల జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా హర్మన్ కొనసాగుతోంది.
100కి పైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్ కూడా హర్మాన్ ప్రీత్‌నే కావడం విశేషం. అదేవిధంగా టీ20ల్లో 3000కి పైగా పరుగులు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా కూడా కౌర్ రికార్డు సాధించింది. వన్డేల్లో ఏడు సెంచరీలు, ఓ టీ20 సెంచరీ ఆమె పేరిట ఉంది.
చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు: అశ్విన్ ఫైర్