
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా పది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సౌతాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యల్ప టోటల్‌ను నమోదు చేసిన రెండో జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్ధానంలో ఉంది. న్యూజిలాండ్ 2009 ప్రపంచకప్‌లో 51 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లండ్
టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
సౌతాఫ్రికా
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజానే కాప్, అన్నేకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మసాబాటా క్లాస్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో మ్లాబా