
మహిళలవన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. బుధవారం ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 89 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లే గార్డ్‌నర్ (83 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.
న్యూజిలాండ్ బౌలర్లలో లీ తహుహు, జెస్ కెర్ 3 వికెట్ల చొప్పున... బ్రీ ఇలింగ్, అమెలియా కెర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 43.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
కెప్టెన్ సోఫీ డివైన్ (112 బంతుల్లో 111; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో సోఫీ, అనాబెల్ 3 వికెట్ల చొప్పున తీశారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది.
చదవండి: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి