మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర నిరాశపరిచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
దీప్తి శర్మతో కలిసి కాసేపు క్రీజులో నిలబడినప్పటికి తన మార్క్ చూపించడంలో మాత్రం విఫలమైంది. 29 బంతుల్లో 20 పరుగులు చేసిన హర్మన్.. సఫారీ స్పిన్నర్ మలాబా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో హర్మన్ విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
చరిత్ర సృష్టించిన హర్మన్..
మహిళల ప్రపంచ కప్ నాకౌట్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్‌లో నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 331 పరుగులు చేసింది.
ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట ఉండేది. బెలిండా తన కెరీర్‌లో వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో 330 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో బెలిండా ఆల్‌టైమ్ రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.
చదవండి: World cup 2025: మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్


