పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. గెలిచే మ్యాచ్‌లో కూడా! | Rain Forces Abandonment Of Third Consecutive Match At Women’s ODI World Cup In Colombo | Sakshi
Sakshi News home page

CWC 2025: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. గెలిచే మ్యాచ్‌లో కూడా!

Oct 16 2025 9:46 AM | Updated on Oct 16 2025 11:17 AM

England and Pakistan share points in rain-affected clash

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో కొలంబో వేదికగా ముచ్చటగా మూడో మ్యాచ్‌ వాన బారిన పడింది. బుధవారం పాకిస్తాన్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. వాన కారణంగా మ్యాచ్‌ను ముందుగానే 31 ఓవర్లకు కుదించారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 31 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. చార్లీ డీన్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగతావారంతా విఫలమయ్యారు. పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా (4/27) ప్రత్యరి్థని దెబ్బ కొట్టగా, సాదియా ఇక్బాల్‌కు 2 వికెట్లు దక్కాయి. 

అనంతరం వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి పాక్‌ 6.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఈ దశలో వచ్యిన వాన ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. సునయాసంగా గెలిచే మ్యాచ్‌లో పాక్‌ను వరుణుడు దెబ్బకొట్టాడు.

ఈ ఫలితం తర్వాత ప్రతీ జట్టు సరిగ్గా నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా...ఇంగ్లండ్‌ (7  పాయింట్లు), ఆ్రస్టేలియా (7), దక్షిణాఫ్రికా (6), భారత్‌ (4) జట్లు తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement