
మనేసర్ (హరియాణా): ఆపరేషన్ సిందూర్(operation Sindoor) ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ప్రధాన కేంద్రాలు, స్థావరాలు, లాంచ్పాడ్లను ధ్వంసం చేసి.. ఇక వారికి ఎక్కడా సురక్షిత ప్రాంతం అనేది లేకుండా చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా మన సైనిక బలగాలు వేటాడుతా యని స్పష్టంచేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్’ (ఎన్‌ఎస్‌జీ) 41వ వ్యవస్థాపక దినోత్స వంలో మంగళవారం ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా అమిత్ షా.. ‘పాకిస్తాన్‌లోని(Pakistan) ఉగ్రవాద ప్రధాన కేంద్రాలు, శిక్షణ స్థావరాలు, లాంచ్పాడ్లను ధ్వంసం చేయగలమని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. పహెల్గాం దాడికి కారణమైన ఉగ్రవా దులను మన భద్రతా దళాలు ఆపరేషన్ మహ దేవ్ ద్వారా అంతమొందించాయి. ఈ రెండు ఆపరేషన్లు మన భద్రతాబలగాలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఉగ్రవాదుల పట్ల ఏమాత్రం కనికరం లేని విధానాన్ని అమలు చేస్తున్నాం. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని తొలగించినప్పటి నుంచి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ వరకు గమనిస్తే.. మన భద్రతా బల గాలు ఉగ్రవాదులు ఏ మూలలో దాక్కున్నా అంతమొందించగలవని అర్థమవుతుంది.
ఉగ్ర వాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఎన్‌ఐఏ చట్టం, మనీలాండరింగ్ నిరో ధక చట్టం వంటివి అందులో భాగమే. కొత్త క్రిమినల్ లాలో ఉగ్రవాదాన్ని మొదటిసారి నిర్వచించి, గతంలో ఉన్న లొసుగులను తొల గించాం. ఇప్పటివరకు 57 మంది వ్యక్తులు, సంస్థలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాం’అని అమిత్ షా వివరించారు. ఉగ్రవాదులు ఏరివేతలోనే కాకుండా మతపరమైన స్థలాలు, దేశ అంతర్గత జలమార్గాలు, పార్లమెంటు తదితర 770 ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌జీ నిఘా కొనసాగిస్తోందని ప్రశంసించారు. ఆయా ప్రాంతాల 3డీ మోడళ్లను కూడా రూపొందిస్తున్నామని ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్ తెలిపారు.