
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరాడు. న్యూఢిల్లీ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ (683 పాయింట్లు) 7 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరాడు.
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా (882 పాయంట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ (726 పాయింట్లు) 12వ ‘ప్లేస్’లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (753 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని భారత్ తరఫున అత్యుత్తమంగా ఐదో ర్యాంక్ కు చేరుకున్నాడు. పంత్ (753 పాయింట్లు) 8వ స్థానంలో ఉన్నాడు.
వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి అగ్రస్థానానికి చేరాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 11 వికెట్లతో సత్తా చాటిన రషీద్ ఖాన్ ఐదు స్థానాలు ఎగబాకి 710 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్ అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గిల్ (784 పాయింట్లు) ‘టాప్’లోనే ఉన్నాడు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్నర్‌కు నో ఛాన్స్?