ఆస్ట్రేలియా క్రికెట‌ర్ వ‌రల్డ్ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు | Alana King reigns supreme with best ever figures in Womens World Cup history | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ వ‌రల్డ్ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు

Oct 25 2025 7:09 PM | Updated on Oct 25 2025 7:42 PM

Alana King reigns supreme with best ever figures in Womens World Cup history

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025లో సంచ‌ల‌నం న‌మోదైంది. ఇండోర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్న‌ర్ అలానా కింగ్ 7 వికెట్లతో చెల‌రేగింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ప్రోటీస్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా అమ్మాయిల జ‌ట్టు.. కింగ్ బౌలింగ్ ధాటికి 16.5 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 97 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. మొత్తంగా 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన కింగ్ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఏడు వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ క్ర‌మంలో కింగ్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది.

కింగ్‌ ప్రపంచ రికార్డు..
👉మహిళల ప్రపంచ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా కింగ్ చ‌రిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు జాకీ లార్డ్ పేరిట ఉండేది. 1982 ప్రపంచకప్‌లో లార్డ్‌ భారత్‌పై 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తాజా మ్యాచ్‌తో 33 ఏళ్ల ఆల్‌టైమ్‌ రికార్డును కింగ్‌ బ్రేక్‌ చేసింది.

మహిళల వరల్డ్ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్
7/18 – అలానా కింగ్ (Alana King) vs సౌతాఫ్రికా, 2025
6/10 – జాకీ లార్డ్ (Jackie Lord) vs ఇండియా, 1982
6/20 – గ్లెనిస్ పేజ్ (Glenys Page) vs ట్రినిడాడ్ & టొబాగో, 1973
6/36 – సోఫీ ఎక్ల్స్టోన్ (Sophie Ecclestone) vs సౌతాఫ్రికా, 2022
6/46 – అన్యా ష్రబ్‌సోల్ (Anya Shrubsole) vs ఇండియా, 2017

👉అదేవిధంగా మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్యంత‌వేగంగా ఫైవ్ వికెట్ హాల్‌(బంతుల ప‌రంగా) సాధించిన బౌల‌ర్‌గా  కింగ్ నిలిచింది. కింగ్ కేవ‌లం 21 బంతుల్లోనే ఈ ఫీట్‌ను అందుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 98 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ అమ్మాయిల జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
చదవండి: #ViratKohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement