breaking news
Alana King
-
World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్‌ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10).. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్‌కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్‌ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెను అవుట్ చేసింది.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్‌ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్‌కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్‌లో నష్రా తొమ్మిదో వికెట్‌గా.. సదర్లాండ్ బౌలింగ్‌లో షమీమ్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వుమెన్ వన్డే క్రికెట్లో తొమ్మిదో వికెట్‌కు వందకు పైగా స్కోరు జతచేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఇంత వరకు ఏ మహిళా జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup 2025)లో భాగంగా పాకిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంక వేదికగా తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆసీస్ (Aus W vs Pak W)తో తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది.టాపార్డర్ కుదేలైనా..అయితే, పాక్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10) నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 5 పరుగులకే నిష్క్రమించింది.మిగిలిన వాళ్లలో కిమ్ గార్త్ (11) తప్ప అంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ, పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశారు. మూనీ సెంచరీ (114 బంతుల్లో 109)తో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.మూనీ- అలనా కలిసి తొమ్మిదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా..ఇక 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. మూనీ- అలనా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు స్కోరు చేయగలిగింది. కాగా మహిళల వన్డే చరిత్రలో ఏడు ఎక్కువ వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జట్టుగానూ ఆసీస్ నిలిచింది. ఏడో వికెట్ పడిన తర్వాత ఆసీస్ 145 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డూ ఆసీస్ పేరు మీదేఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 91 పరుగులకే ఏడు వికెట్ల నష్టపోయిన వేళ.. గ్లెన్ మాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్ కలిసి అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 202 పరుగులు జోడించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆసీస్‌ను నిలిపారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
పాక్ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్ బ్యాటర్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్‌కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బౌలర్ల విజృంభణకెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్‌ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది.పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్‌రౌండర్ అలనా కింగ్‌తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్‌లో సదాఫ్ షమాస్కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లుమరో ఎండ్‌లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌పై బ్యాట్‌తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025