
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వుమెన్ వన్డే క్రికెట్‌లో తొమ్మిదో వికెట్‌కు వందకు పైగా స్కోరు జతచేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఇంత వరకు ఏ మహిళా జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup 2025)లో భాగంగా పాకిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంక వేదికగా తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆసీస్ (Aus W vs Pak W)తో తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది.
టాపార్డర్ కుదేలైనా..
అయితే, పాక్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10) నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 5 పరుగులకే నిష్క్రమించింది.
మిగిలిన వాళ్లలో కిమ్ గార్త్ (11) తప్ప అంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ, పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశారు. మూనీ సెంచరీ (114 బంతుల్లో 109)తో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
మూనీ- అలనా కలిసి తొమ్మిదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.
ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఇక 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. మూనీ- అలనా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు స్కోరు చేయగలిగింది. కాగా మహిళల వన్డే చరిత్రలో ఏడు ఎక్కువ వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జట్టుగానూ ఆసీస్ నిలిచింది. ఏడో వికెట్ పడిన తర్వాత ఆసీస్ 145 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
ఆ రికార్డూ ఆసీస్ పేరు మీదే
ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 91 పరుగులకే ఏడు వికెట్ల నష్టపోయిన వేళ.. గ్లెన్ మాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్ కలిసి అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 202 పరుగులు జోడించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆసీస్‌ను నిలిపారు.
చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు