
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(Richa Gosh) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిల జట్టు కేవలం 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మంధాన, హర్మన్ ప్రీత్, ప్రతీక, దీప్తి శర్మ వంటి కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో టీమిండియా స్కోర్ 150 మార్క్ దాటడం కష్టమే అని అంతా భావించారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా అద్భుతం చేసింది. తన విరోచిత పోరాటంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
వికెట్లు పడినప్పటికి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసింది. ఓ దశలో సెంచరీ మార్క్ అందుకునేలా కన్పించిన రిచా.. ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాతి బంతికే క్రీజులోకి వచ్చిన శ్రీచరణి కూడా ఔటైంది. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రోటీస్ ముందు భారత్ ఫైటింగ్ టోటల్‌ను ఉంచగల్గింది.

భారత బ్యాటర్లలో ఘోష్‌తో పాటు ప్రతికా రావల్(37), స్నేహ్ రాణా(33) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, మల్బా, నాడిన్ డి క్లెర్క్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.