భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ సారథ్యం వహించనున్నాడు. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ లొర్కాన్ టక్కర్ వ్యవహరించనున్నాడు.
అయితే ఈ జట్టులో అన్నదమ్ముల జోడీలు ఉన్నాయి. మార్క్ అడైర్, రాస్ అడైర్‌తో పాటు హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్ బ్రదర్స్ వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్, ఆల్ రౌండర్ కర్టిస్ కాంఫర్ స్టార్ ప్లేయర్లను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్.. ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌లతో పాటు గ్రూపు-బిలో ఉంది. ఐరీష్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కోలంబో వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఐర్లాండ్.. న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.
చదవండి: BBL 2025-26: ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..


