WPL 2026: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ | MI vs RCB WPL 2026: Mandhana opts to bowl, Both Teams Playing 11s | Sakshi
Sakshi News home page

MI vs RCB WPL 2026: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ

Jan 9 2026 6:51 PM | Updated on Jan 9 2026 7:32 PM

MI vs RCB WPL 2026: Mandhana opts to bowl, Both Teams Playing 11s

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026 సీజ‌న్‌కు తెర‌లేచింది. తొలి మ్యాచ్‌లో న‌వీ ముంబై వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి ‍మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

అయితే తొలి మ్యాచ్‌కు ముంబై స్టార్‌ ప్లేయర్‌ హీలీ మాథ్యూస్‌ దూరమైంది. అదేవిధంగా ఆసీస్‌ ప్లేయర్‌ నికోలా కారీ ముంబై తరపున డబ్ల్యూపీఎల్‌ అరంగేట్రం చేసింది. ఆర్సీబీ తరపున అయితే ఏకంగా ఆరుగురు అరంగేట్రం చేశాఉరు. గ్రేస్ హారిస్,లిన్సే స్మిత్, లారెన్ బెల్,  అరుంధతి రెడ్డి వంటి స్టార్‌ ప్లేయర్లకు ఆర్సీబీ తరపున ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం.

తుది జట్లు
ముంబై ఇండియన్స్: నాట్ స్కివర్-బ్రంట్, జి కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్‌), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్(వికెట్ కీపర్‌), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్

ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్‌..
ఇక  డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకను బీసీసీఐ ఘనం‍గా నిర్వహించింది. తొలుత మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు మహిళా సాధికారతపై ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్స్‌తో, యో యో హనీ సింగ్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement