చరిత్ర సృష‍్టించిన సౌతాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌ | Shabnim Ismail scripts history, becomes first bowler to take 50 wickets in Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష‍్టించిన సౌతాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌

Jul 3 2026 4:33 PM | Updated on Jul 3 2026 4:41 PM

Shabnim Ismail scripts history, becomes first bowler to take 50 wickets in Womens T20 World Cup

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో సౌతాఫ్రికా పోరాటం ముగిసింది. ద‌క్షిణాఫ్రికా అమ్మాయిల జ‌ట్టు మ‌రోసారి  నాకౌట్స్ గండాన్ని దాట‌లేక‌పోయింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో 40 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక లారా వాల్వార్ట్‌ సేన చతకిల పడింది. 

అయితే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరకపోయినప్పటికి.. ఆ జట్టు సీనియర్ పేసర్  షబ్నిమ్ ఇస్మాయిల్ మాత్రం అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే 50 వికెట్ల మార్కును అందుకున్న మొట్టమొదటి బౌలర్‌గా ఆమె సరికొత్త రికార్డు సృష్టిం‍చారు.

ఇంగ్లండ్ ఓపెనర్ అమీ జోన్స్ వికెట్‌తో ఇస్మాయిల్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 37 ఏళ్ల ఇస్మాయిల్ ప్రస్తుతం సౌతాఫ్రికా మహిళల జట్టు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నారు. 127 వన్డేల్లో 191 వికెట్లు పడగొట్టిన ఈ ముంబై ఇండియన్స్ పేసర్‌.. టీ20ల్లో ఇప్పటివరకు 131 వికెట్లు సాధించారు.

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆమె ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇస్మాయిల్‌, టీ20 ప్రపంచకప్ కోసం తన నిర్ణయాన్ని వెనక్కి మార్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ తన జట్టును ఛాంపియన్‌గా నిలపలేకపోయారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు వీరే
51 - షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)
48 - మేగాన్ షట్ (ఆస్ట్రేలియా)
44 - ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా)
41 - అన్య ష్రుబ్సోల్ (ఇంగ్లండ్‌)
39 - మారిజానే కాప్(దక్షిణాఫ్రికా)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement