హైదరాబాద్ : ఒకవైపు చేప ముక్కల వేపుళ్లు.. మరోవైపు తాటి కల్లు.. తెలంగాణలో బోనాల పండగకు చేసే పిండి వంటలు.. ఇంకోవైపు రాయలసీమ రుచులు.. ఒకటా.. రెండా పదులకొద్దీ పలు రకాల వంటకాలు అక్కడ కొలువుదీరాయి. సందర్శకులను నోళ్లను చవులూరించాయి.
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫుడ్– ఎ–ఫెయిర్– 2026ను (Food A'Fair 2026) గురువారం భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఏఎల్‌ఈఏపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రమాదేవి, ఐసీఏఆర్–ఐఐఎంఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.స్టాన్లీ, ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ సంజయ్ తుమ్మ తదితరులు పాల్గొన్నారు.


