తన సోదరి అన్షులా కపూర్ పెళ్లి వేడుకల్లో ఎన్నో గుర్తుండిపోయే లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, లండన్‌లో తన సన్నిహిత స్నేహితురాలి పెళ్లిలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
జాన్వీ ప్రత్యేకంగా మనీష్ మల్హోత్రా కౌచర్‌లో డిజైన్ చేయించిన లెహంగాలో మెరిసింది. క్రిస్టల్స్‌తో పొదిగిన క్లిష్టమైన భారతీయ హస్తకళా నైపుణ్యంతో డిజైన్ చేశారు.
అలాగే ఆమె ధరించి లేత సేజ్ గ్రీన్ రంగు లెహంగాకు అనుగుణంగా చక్కని ఆకృతి గల కౌచర్ బ్లౌజ్‌ను డిజైన్ చేశారు మల్హోత్రా.
ఆ డిజైనర్‌వేర్‌కి సరిపోయే పచ్చలు, వజ్రాలతో పొదిగిన పెద్దసైజు చెవిపోగులు మాత్రమే ధరించి..
కుందనపు బొమ్మలా ఆకర్షణీయంగా కనిపించింది.


