-
Birthday Special: గ్లామర్‌తో బాలీవుడ్లో హీట్ పెంచిన అనన్య పాండే బర్త్‌డే నేడు (ఫోటోలు)
-
యాంకర్ దేవిక సింగ్ గ్లామర్ ఫోటోలు
-
నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు
నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదని తెగ ఇదైపోతోంది నటి శ్రీదివ్య. అదృష్టం అంటే ఈ అమ్మడిదే అనక తప్పదు. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్ తెరపై మెరిసిన ఆంధ్రా పోరి శ్రీదివ్య. ఆ తరువాత జీవా, కాక్కీసట్టై చిత్రాల విజయాలతో హీరోయిన్గా తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ బ్యూటీ గ్లామర్ జోలికి పోకుండా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలను చేతిలో పెట్టుకున్న శ్రీదివ్య ఇటీవల విడుదలైన బెంగళూర్ నాట్కళ్ చిత్రంలో చక్కని అభినయంతో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఈ సక్కనమ్మతో చిన్న చిట్‌చాట్.. ప్ర: తెలుగమ్మాైయై ఉండి పూర్తిగా తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారు. అక్కడ అవకాశాలు రావడం లేదా? జ: నేను బాల నటిగా పరిచయమైంది తెలుగులోనే. హీరోయిన్ స్థాయికి ఎదిగిందీ అక్కడే. అయితే నాకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెడుతున్నది తమిళసినిమానే. నాలోని నటనా ప్రతిభను చాటుకునే విధంగా మంచి కథా పాత్రలతో కూడిన అవకాశాలు ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే ఇతర భాషా చిత్రాలపై ఆసక్తి కనబరచడం లేదు. ప్ర: బెంగళూర్ నాట్కళ్ చిత్రంలో తొలిసారిగా డబ్బింగ్ చెప్పినట్టున్నారు? జ: తెలుగులో నేను నటించిన అన్ని చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తమిళంలో జీవా, కాక్కీసట్టై చిత్రాలకు డబ్బింగ్ చెప్పాలని ఆశించాను. అయితే వాయిస్ టెస్ట్ తెలుగు యాస తెలుస్తోందని రిజెక్ట్ చేశారు. దాంతో స్వచ్ఛమైన తమిళ భాష ఎలా మాట్లాడాలన్నది నేర్చుకుని బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన పెన్సిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కార్తీ సరసన కాస్మోరా చిత్రం, విశాల్‌కు జంటగా మరుదు, జీవాతో ఒక చిత్రం చేస్తున్నాను. ప్ర: విశాల్ మీ కంటే చాలా హైట్. ఆయనకు జంటగా ఎలా మెయిన్‌టెయిన్ చేయగలుగుతున్నారు? జ: నిజమే నేను కాస్త పొట్టే. మంచి పొడుగైన విశాల్‌తో నటించడానికి స్టూల్ సాయం తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో మదురై యాసలో మాట్లాడి నటించడం వినూత్న అనుభవం అనే చెప్పాలి. తెలుగమ్మాయినైనా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుని నటిస్తున్నాను. ప్ర: పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారట? జ: నేనిప్పటి వరకూ ఎవరి వద్దా పారితోషికం డిమాండ్ చేసింది లేదు. ప్రస్తుత నా స్థాయికి తగ్గ పారితోషికమే చెల్లిస్తున్నారు. ప్ర: లక్ష్మీమీనన్, కీర్తీసురేష్, నందిత, ఐశ్వర్యారాజేష్ లాంటి వారు కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. వారిని పోటీగా భావిస్తున్నారా? జ: ఒకే చిత్రంలో పలువురు హీరోయిన్లు నటిస్తే అప్పుడు వారి ప్రతిభను నిరూపించుకోవడానికి పోటీ ఉంటుంది. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది. అయితే నేనెవరినీ పోటీగా భావించడం లేదు. ప్ర: ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటున్నార ట. ఎవరినైనా ప్రేమించారా? జ: కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటా. అయితే నేను ప్రేమించే వ్యక్తిని ముందుగా నా తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అభిప్రాయాన్ని అడుగుతాను. వారికి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను. ఇక ప్రేమించారా? అని అడుగుతున్నారు. నేను నటినైన తరువాత ఇప్పటి వరకూ నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు. నేనెవరితోనూ అంతగా కలివిడిగా మాట్లాడను. నాతో మాట్లాడడానికి భయం కారణంగానే బహుశా ఎవరూ ఐ లవ్యూ చెప్పడానికి సాహసించడం లేదేమో.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement