మహిళల టీ20 ప్రపంచకప్-2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేచింది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా 24 ఏళ్ల యువ స్పిన్నర్ ప్రేమ రావత్ భారత్ తరపున అరంగేట్రం చేసింది.
గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రేయాంక పాటిల్ స్ధానంలో ప్రేమ రావత్ జట్టులోకి వచ్చింది. అదేవిధంగా క్రాంతి గౌడ్ స్ధానంలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డికి తుది జట్టులో చోటు దక్కింది.
కాగా భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. మహిళల క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా హర్మన్ నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్‌సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(వికెట్ కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మలాబా
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ


