కొరియా మాస్టర్స్ ఛాంపియన్ అశ్మిత | Ashmita Chaliha beats Han Qianxi to win maiden BWF World tour title at Korea Masters | Sakshi
Sakshi News home page

కొరియా మాస్టర్స్ ఛాంపియన్ అశ్మిత

Aug 9 2026 11:36 AM | Updated on Aug 9 2026 11:36 AM

Ashmita Chaliha beats Han Qianxi to win maiden BWF World tour title at Korea Masters

కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత యువ ష‌ట్ల‌ర్ అశ్మిత చాలిహా అద‌ర‌గొట్టింది. ఈ టోర్నీ మ‌హిళ‌ల సింగిల్స్ విజేత‌గా అశ్మిత నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో చైనాకు చెందిన హాన్ ఖియాన్ క్సీపై  14-21, 21-14, 21-14 తేడాతో విజ‌యం సాధించిన అశ్మిత.. త‌న తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్‌ టైటిల్‌ను ముద్దాడింది. 

53 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో అస్సాంకు చెందిన అశ్మిత .. తొలి గేమ్‌లోకాస్త త‌డ‌బ‌డింది. తొలి గేమ్‌ను చైనా షట్లర్ హాన్ 14-21తో సొంతం చేసుకుంది. అనంత‌రం రెండో గేమ్‌లో అశ్మిత అద్భుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చింది. అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడి హాన్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. 

ఈ అస్సాం ష‌ట్ల‌ర్ సంచ‌ల‌న‌ ప్రదర్శనతో రెండో గేమ్‌ను 21-14తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో కూడా ఆమె స‌త్తాచాటింది. ఒక దశలో 9-11తో వెనకబడినప్పటికీ అశ్మిత ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. కీలక సమయంలో తిరిగి పుంజుకుని ప్ర‌త్యర్ధిపై 21-14తో తేడాతో విజ‌యం సాధించింది. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ఆమె గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement