మిచెల్ శాంట్న‌ర్ విధ్వంసం.. ముంబై జ‌ట్టుకు రాకెట్స్ షాక్‌ | Santner Trumps Curran As Trent Rockets Make It Six In A Row, Beat MI London By 6 Wickets In The Hundred 2026 | Sakshi
Sakshi News home page

మిచెల్ శాంట్న‌ర్ విధ్వంసం.. ముంబై జ‌ట్టుకు రాకెట్స్ షాక్‌

Aug 9 2026 8:12 AM | Updated on Aug 9 2026 12:21 PM

Santner trumps Curran as Rockets make it six in a row

ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో ట్రెంట్ రాకెట్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శనివారం కెన్నింగ్టన్ ఓవరల్ వేదికగా ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్ ఘన విజయం సాధించింది. ఇది ట్రెంట్స్ రాకెట్స్‌కు ఆరో విజయం కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో సామ్‌ కుర్రాన్‌(72) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. విల్‌ జాక్స్‌(39) రాణించాడు.  మిగితా పూరన్‌, విన్స్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు విఫలమయ్యారు. ట్రెంట్ రాకెట్స్ బౌల‌ర్ల‌లో లూయిస్ గ్రెగొరీ రెండు వికెట్లు ప‌డగొట్టాడు.

శాంట్న‌ర్ మెరుపులు వృథా
అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని రాకెట్స్ జట్టు కేవలం 90 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు టిమ్‌ డేవిడ్‌(32), డొనాల్డ్‌ (10 బంతుల్లో 23) దూకుడుగా ఆడారు.
చదవండి: భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే 9 టెస్టుల్లో 7 గెలవాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement