భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే 9 టెస్టుల్లో 7 గెలవాలి! | India needs to win 7 out of 9 Tests to reach WTC final | Sakshi
Sakshi News home page

భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే 9 టెస్టుల్లో 7 గెలవాలి!

Aug 9 2026 3:50 AM | Updated on Aug 9 2026 3:50 AM

India needs to win 7 out of 9 Tests to reach WTC final

తొలి రెండు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు గత ఏడాది ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఇప్పుడు 2027 ఫైనల్‌ లక్ష్యంగా కొత్త సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా అవకాశాలు కాస్త సంక్లిష్టంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 4 ఓడి మరొకటి ‘డ్రా’గా ముగించిన జట్టు 48.15 పాయింట్ల శాతం (మొత్తం పాయింట్లు 52)తో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. మరో 9 టెస్టులు మిగిలి ఉండగా 2 శ్రీలంకలో, 2 న్యూజిలాండ్‌లో ఆడనున్న టీమ్‌ ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై 5 టెస్టులు ఆడాల్సి ఉంది. 

ఫైనల్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కనీసం 60 పాయింట్ల శాతాన్ని అందుకోవాలి. అంటే కనీసం మరో 78 పాయింట్లు కావాలి. దీని ప్రకారం భారత్‌ కనీసం 6 గెలిచి 2 డ్రా చేసుకోవాలి. లేదా 7 టెస్టులు గెలవాలి. లంకతో సవాల్‌ తర్వాత కివీస్‌ గడ్డపై కూడా జట్టుకు అంత సులువు కాదు. గత 18 ఏళ్లలో ఆసీస్‌తో భారత్‌లో 12–2తో మనదే పైచేయిగా ఉన్నా... ఇటీవల జట్టు ఫామ్‌...న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో పరాజయాలను బట్టి చూస్తే కంగారూలపై కూడా టీమిండియా బాగా శ్రమించాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement