తాష్కెంట్: ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు ఎస్. గురునాయుడు రజత పతకం (60 కేజీల కేటగిరీ) గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గురు నాయుడు మొత్తం 265 కేజీల (స్నాచ్ 119 కేజీలు + క్లీన్ అండ్ జర్క్ 146 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత వెయిట్ లిఫ్టర్ తోమ్చు మీటి స్వర్ణం సాధించాడు. తోమ్చు మొత్తం 266 కేజీల (స్నాచ్ 116 కేజీలు + క్లీన్ అండ్ జర్క్ 150 కేజీలు) బరువును ఎత్తి మొదటి స్థానంతో ముగించాడు.


