అశ్విని జోడీకి టైటిల్‌ | Ashwini-Tanisha win women's doubles title | Sakshi
Sakshi News home page

అశ్విని జోడీకి టైటిల్‌

Jun 20 2023 4:02 AM | Updated on Jun 20 2023 4:02 AM

Ashwini-Tanisha win women's doubles title - Sakshi

నాంటెస్‌ (ఫ్రాన్స్‌): భారత సీనియర్‌ షట్లర్‌ అశ్విని పొన్నప్ప నాంటెస్‌ అంతర్జాతీయ చాలెంజ్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అశి్వని–తనీషా క్రాస్టో జంట ఫైనల్లో 21–15, 21–14తో హంగ్‌ ఎన్‌ జు–లిన్‌ యు పే (చైనీస్‌ తైపీ) జోడీపై అలవోక విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో భారత ద్వయం 0–4తో వెనుకబడింది. తర్వాత అశి్వని–తనీషా ద్వయం వరుసగా పాయింట్లు సాధించి 10–10 వద్ద తొలి గేమ్‌ను సమం చేసి ఆ తర్వాత అదే జోరుతో గేమ్‌ను గెలుచుకుంది.

అనంతరం రెండో గేమ్‌లో 3–3 వద్ద ఉండగా... భారత జోడీ వరుసగా 7 పాయింట్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరకు 31 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీషా–సాయి ప్రతీక్‌ జంటకు అదృష్టం కలిసిరాలేదు. క్వాలిఫయర్స్‌గా బరిలోకి దిగి ఫైనల్‌ చేరిన ఈ జంట పరాజయాన్ని ఎదుర్కొంది. ఫైనల్లో తనీషా–సాయిప్రతీక్‌ జోడీ 21–14, 14–21, 17–21తో మాడ్స్‌ వెస్టెర్‌గార్డ్‌–క్రిస్టిన్‌ బస్చ్‌ (డెన్మార్క్‌) జంట చేతిలో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement