సునీల్ న‌రైన్ మ్యాజిక్‌.. నైట్‌రైడ‌ర్స్ శుభారంభం | Miserly Narine at it again as TKR begin title defence in style | Sakshi
Sakshi News home page

CPL: సునీల్ న‌రైన్ మ్యాజిక్‌.. నైట్‌రైడ‌ర్స్ శుభారంభం

Aug 9 2026 11:16 AM | Updated on Aug 9 2026 11:16 AM

Miserly Narine at it again as TKR begin title defence in style

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ త్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) శుభారంభం చేసింది. శ‌నివారం సెయింట్ విన్సెంట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌ జరిగిన మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో(డ‌క్ వ‌ర్త్ లూయిస్‌) టీకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. టీకేఆర్ స్టార్ స్పినర్‌ సునీల్ నరైన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 

నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి పేట్రియాట్స్ పతనాన్ని శాసించాడు. పేట్రియాట్స్ ఓ దశలో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెవిన్ విక్‌హామ్ (38) ఒంటరి పోరాటం చేయడంతో పేట్రియాట్స్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది.

అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలోనే ఓపెనర్లు అలెక్స్ హేల్స్, కోలిన్ మున్రోల వికెట్లును కోల్పోయింది. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్‌కే (35*), జాషువా డా సిల్వా (18*) నిలకడగా ఆడి జట్టును విజయం​ వైపు నడిపించాడు. 

అయితే గెలుపు దిశగా సాగుతున్న సమయంలో నైట్‌రైడర్స్ స్కోర్ 94/2 వద్ద ఆటకు వర్షం అంతరాయం ‍కలిగించింది. ఆ సమయానికి డీఎల్‌ఎస్ పార్ స్కోర్ కంటే 19 పరుగుల ముందుండడంతో టీకేఆర్‌నే విజయం వరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement