breaking news
Korea Masters Grand Prix Gold tournament
-
కొరియా మాస్టర్స్ ఛాంపియన్ అశ్మిత
కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ అశ్మిత చాలిహా అదరగొట్టింది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా అశ్మిత నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో చైనాకు చెందిన హాన్ ఖియాన్ క్సీపై 14-21, 21-14, 21-14 తేడాతో విజయం సాధించిన అశ్మిత.. తన తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను ముద్దాడింది. 53 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో అస్సాంకు చెందిన అశ్మిత .. తొలి గేమ్లోకాస్త తడబడింది. తొలి గేమ్‌ను చైనా షట్లర్ హాన్ 14-21తో సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో అశ్మిత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడి హాన్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ అస్సాం షట్లర్ సంచలన ప్రదర్శనతో రెండో గేమ్‌ను 21-14తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో కూడా ఆమె సత్తాచాటింది. ఒక దశలో 9-11తో వెనకబడినప్పటికీ అశ్మిత ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. కీలక సమయంలో తిరిగి పుంజుకుని ప్రత్యర్ధిపై 21-14తో తేడాతో విజయం సాధించింది. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ఆమె గెలుచుకుంది. -
కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో కశ్యప్
జెజు (కొరియా): మోకాలి గాయం నుంచి కోలుకున్నాక భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తొలిసారి ఓ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-11, 13-21, 21-8తో జూ జెకి (చైనా)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)తో ఆడతాడు. మోకాలి గాయం నుంచి తేరుకున్నాక కశ్యప్ ఆరు టోర్నీల్లో పాల్గొనగా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందలేకపోయాడు. ఏడో టోర్నీలో మాత్రం అతను ఈ అడ్డంకిని అధిగమించాడు.


