ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడింది. లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన హర్మన్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకం (56) సాధించగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగింది. ఆసీస్ లక్ష్య ఛేదనకు దిగింది.
ఆదిలోనే ఓపెనర్ జార్జియా వోల్ (4) అవుటైనా.. బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) ఫర్వాలేదనిపించారు. ఎలిస్ పెర్రీ (56), ఆష్లే గార్డ్‌నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. తమతో పాటు గ్రూప్-ఎ నుంచి సౌతాఫ్రికాను సెమీస్‌కు తీసుకువెళ్లింది.
*******************************************
మూడో వికెట్ డౌన్
9.1: దీప్తి శర్మ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బెత్ మూనీ (22). ఆష్ గార్డ్‌నర్ క్రీజులోకి రాగా.. పెర్రి 11 పరుగులతో ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
6.6: శ్రీచరణి బౌలింగ్‌లో లిచిఫీల్డ్ (24) స్మృతి మంధానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఎలిస్ పెర్రి క్రీజులోకి వచ్చింది. మూనీ 20 పరుగులతో ఉంది. స్కోరు: 55-2(7.2).
పవర్ ప్లేలో ఆస్ట్రేలియా స్కోరు: 49-1 (6)
మూనీ 17, లిచిఫీల్డ్ 22 పరుగులతో ఉన్నారు.
నాలుగు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 25-1
మూనీ 5, లిచిఫీల్డ్ 12 పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
0.2: రేణుకా సింగ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన జార్జియా వోల్ (4). ఫోబీ లిచిఫోల్డ్ క్రీజులోకి రాగా.. బెత్ మూనీ సున్నా పరుగులతో ఉంది. స్కోరు: 4-1(0.3).
భారత్ స్కోరు: 170-4(20)
హర్మన్ అవుట్
19.5: సోఫీ మోలినెక్స్ బౌలింగ్‌లో ఎలిస్ పెర్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (27 బంతుల్లో 56).
హర్మన్ హాఫ్ సెంచరీ
25 బంతుల్లో అర్ద శతకం పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్
జెమీమా రిటైర్డ్ అవుట్
రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 147-3 (19)
అర్ధ శతక భాగస్వామ్యం
18 ఓవర్లు ముగిసేసరికి జెమీమా 26, హర్మన్ 33 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి యాభై పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. స్కోరు: 134-2.
14 ఓవర్లలో భారత్ స్కోరు: 102-2
జెమీమా 13, హర్మన్ ప్రీత్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
స్మృతి రనౌట్
11.3: జార్జ్ వారేహామ్ బౌలింగ్‌లో జెమీమా షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసింది. అంతలోనే మరో ఎండ్ నుంచి ముందుకు వచ్చిన స్మృతి రనౌట్ అయింది. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 85-2 (12).
తొలి వికెట్ కోల్పోయిన భారత్
9.1: మోలినెక్స్ బౌలింగ్‌లో షఫాలీ వర్మ బౌల్డ్ (26 బంతుల్లో 34). జెమీమా రోడ్రిగ్స్ క్రీజులోకి రాగా.. స్మృతి 30 పరుగులతో ఉంది. స్కోరు: 68-1(9.2).
పవర్ ప్లేలో భారత్ స్కోరు 43-0(6)
స్మృతి 22 బంతుల్లో 22, షఫాలీ 14 బంతుల్లో 20 పరుగులతో ఉన్నారు.
నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0
స్మృతి 15, షఫాలీ 14 పరుగులతో ఉన్నారు.
రెండు ఫోర్లు బాదిన స్మృతి
కిమ్ గార్త్ బౌలింగ్‌లో రెండు, మూడో బంతికి వరుసగా ఫోర్లు బాదిన స్మృతి. స్కోరు: 11-0 (2).
తొలి ఓవర్లో మూడు పరుగులు
స్మృతి రెండు, షఫాలీ వర్మ ఒక పరుగుతో ఉన్నారు.
ఒక్కో మార్పు
ఈ మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ తెలిపింది. నందిని శర్మ స్థానంలో క్రాంతి గౌడ్ ఆడుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. ఆసీస్ తుదిజట్టులో ఫీబ్స్ అలనా కింగ్ స్థానాన్ని భర్తీ చేసినట్లు సారథి మోలినెక్స్ తెలిపింది.
కాగా గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే ఆసీస్ అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. మరోవైపు.. సౌతాఫ్రికా తాజాగా బంగ్లాదేశ్‌ను ఓడించి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో ఆరు పాయింట్లతో ఉన్న భారత్ తప్పక గెలిస్తేనే సెమీస్‌లో అడుగుపెట్టగలదు.
తుదిజట్లు
భారత్
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్
ఆస్ట్రేలియా
బెత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కేరీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్


