‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’ | Harmanpreet Kaur Comments Winning Credits-Manadana-Deepthi Vs PAK | Sakshi
Sakshi News home page

IND Vs PAK: ‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

Jun 15 2026 7:54 AM | Updated on Jun 15 2026 11:59 AM

Harmanpreet Kaur Comments Winning Credits-Manadana-Deepthi Vs PAK

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. దీప్తిశ‌ర్మ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శన‌కు తోడు మంధాన‌, హ‌ర్మ‌న్ మెరుపుల‌తో పాక్‌పై భార‌త్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. కాగా మ్యాచ్ విజ‌యం అనంత‌రం హ‌ర్మ‌న్‌ప్రీత్ మాట్లాడింది. 

'మ్యాచ్ విజ‌యంతో చాలా సంతోషంగా ఉన్నా. ముందుగా మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన అభిమానులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు. మ్యాచ్ విజ‌యంలో (స్మృతి మంధాన‌, దీప్తి శ‌ర్మ‌) ఆ ఇద్ద‌రిదే కీల‌క‌పాత్ర‌. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా వారు ముందుంటారు. ఇవాళ వాళ్లిద్ద‌రూ ఆడిన తీరు చూసి సంతోషంగా అనిపించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆరంభంలో వికెట్లు ప‌డ‌డంతో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాం. అయితే పిచ్‌పై అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత‌ మంధాన‌, నేను స్వేచ్ఛ‌గా ఆడాం. 

రిచా ఘోష్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వొచ్చు. కానీ ఆమె ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని చెప్పింది. ఇవాళ ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించింది. ఇక ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో వాటిని సరిచేసుకుంటాం. నెట్ రన్‌రేట్ అనేది కీలకం కాబట్టి మరింత వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం.' అని చెప్పుకొచ్చింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.  వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్‌ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టింది. పాకిస్తాన్‌ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement